ముందుమాట
స్వాగతం
వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సమితి (VBBS)
ఆత్మీయ వేములవాడ బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం!
వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సమితి (VBBS) బ్రాహ్మణ సమాజాన్ని ఏకం చేయడానికి, పరస్పర సహాయ సహకారాలు పెంపొందించడానికి, సాంస్కృతిక, ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు ఓ వేదికగా స్థాపించబడింది. మేము భాగ్యనగరంలో స్థిరపడిన వేములవాడ బ్రాహ్మణులను ఒక కుటుంబంలా అనుభూతి చెందించేలా,
“ఒకరికోసం అందరం – అందరిలో ఒకరు” అన్న భావనతో ముందుకు సాగుతున్నాము.
ఈ వేదిక ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టుకోవడమే కాకుండా,
ఒకరికొకరు మద్దతుగా నిలిచి,
ఆప్యాయతను పంచుకునే అవకాశాన్ని అందిస్తున్నాము. బంధుత్వాన్ని బలపరుస్తూ,
మన పునాదులను మరింత దృఢంగా మలచడమే VBBS లక్ష్యం.
మన సమితిలో చేరి, మన కార్యక్రమాలలో పాలుపంచుకుని, మన ఏకతాభావాన్ని ప్రదర్శించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
ఇందులో ప్రతి ఒక్కరూ విలువైన భాగస్వాములే!
ధర్మస్య జయోస్తు!
అధర్మస్య నాశోస్తు!
ప్రాణిషు సద్భావానాస్తు!
విశ్వస్య కళ్యాణమస్తు!
మీ వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సమితి (VBBS) !
లోకా సమస్తా సుఖినో భవంతు.