MANA VBBS

వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సంస్థ

లక్ష్యాలు – స్పష్టీకరణలు .
1).సామూహిక సంఘ భవనం-( వేములవాడ బ్రాహ్మణ భవన్, భాగ్యనగరం)-అభిషేకాలు, చిన్న వేడుకలు, సమావేశాలు, శ్రాద్దాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి 2). వృద్ధులకు చేయూతనివ్వడం, యువతకు చేదోడు వాదోడుగా….వేములవాడ నుండి నగరం చేరే యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడం ఉద్యోగ పరికల్పన చేయడం మొదలగునవి ‘ 3). వైదిక సహకారం,ఇళ్లలో జరిగే వివాహ సందర్భాలలో , అశౌచ సందర్భాలలో మేమున్నాం అంటూ పరస్పర సహకారాన్ని కల్పించడంశ్రాద్ధ బ్రాహ్మణులు , భోక్తలు, వ్రత కథకులు ,అభిషేక రుత్వికులు ఒకే వేదికపై చేరేలా ప్రోత్సహించడం 4).వైద్య సహాయం ….. మన వైద్య కమిటీ సభ్యులచే తగిన సూచనలు సలహాలు ఇప్పించడం,ఆరోగ్య శిబిరాలు, ఇన్సూరెన్స్ కల్పన, నిస్సహాయ పరిస్థితుల్లో అన్ని విధాల ఆదుకోవడం 5).సంబంధ బాంధవ్యాల కొనసాగింపు ….. ఎక్కడెక్కడో ఉన్న మన వారిలో మేమున్నామంటూ ధైర్యాన్ని కల్పించడం వ్యక్తిగత పరిచయం పెంచుకోవడం అందరి కుటుంబ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనడం 6).భాగ్యనగర వేములవాడ వారధిగా ……అన్యోన్య అవసరాలు తీర్చడం, ఎప్పటికప్పుడు తాజా వార్తలతో 7). అనువంశిక హక్కుల సాధన…..దేవాలయానికి చెందిన విషయాలలో భాగస్వామ్యం పెంచుకోవడం శివరాత్రి వంటి రోజుల్లో అవసరాలు తీర్చడం మన గుడి అనే కాన్సెప్ట్ బలపరచడం 8). మన వారి కి భోజన వసతి సౌకర్యాలు కల్పన …హైదరాబాదు నుండి వేములవాడ పోయే వారికి భోజనం వసతి సౌకర్యాలు కల్పించడం లో సమిష్టి కృషి 9). ప్రయాణంలో సహకారం…. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వారికి ఇక్కడి నుంచి అక్కడికి పోయే వారికి మన వారి వాహనాల్లో చోటు ఏర్పాటు చేయడం లేదా దానికి సంబంధించిన సమాచారాన్ని చేర్చడం. 10).వివాహ సంబంధాల్లో భాగస్వామ్యం మన కుటుంబాల్లోని యువతి యువకుల తో వైవాహిక సంబంధాలు కుదిరే విధంగా సహాయ సహకారాలు అందించడం,అన్ని కుటుంబాల గోత్ర వివరాలు ఇతర అంశాలు అందుబాటులో ఉంచడం 11). నైపుణ్యాల ప్రోత్సాహం…. మన కుటుంబంలోని వ్యక్తులలో ఉన్న ప్రతిభను గుర్తించడం ప్రోత్సహించడం పిల్లల్లో ఉన్న సృజనాత్మకతకు వేదికలను ఏర్పాటు చేయడం 12). ప్రత్యేక పండుగలు – సామూహిక కార్యక్రమాలు ….వన భోజనాలు, బతుకమ్మ, జంధ్యాల వున్నమి, వంటి ప్రత్యేక దిన కార్యక్రమాల్లో సామూహిక సౌకర్యాల కల్పన 14).మన ఊరి భాష, సంస్కృతుల పరిరక్షణ ….మన వారి రచనలను ప్రోత్సహించడం సన్మానాలు ఏర్పాటు చేసుకోవడం 15).పరస్పర భావాల వినిమయం … అంతా కలిసి మనసు విప్పి మాట్లాడుకునే వాతావరణం ఏర్పాటు చేయడం మన ఊరి అంశాలు , దేవాలయ కార్యక్రమ వార్తలు , ఆధ్యాత్మిక అంశాలు ఒకరితో ఒకరు సంభాషించడానికి సరైన వాతావరణం కల్పించడం 16).ప్రత్యేక పరిస్థితుల్లో ఆసరా …. భారీ వర్షం వంటి సమయాల్లో ఎక్కడెక్కడో చిక్కుబడిన వారికి ఎన్నోరకాల ఆపదలో ఉన్నవారికి తక్షణం స్పందించి చేరువలో ఉన్న వారు సహాయం చేయడం 17).మన కులమే మన బలం … కులబలం అవసరమున్న అన్ని సందర్భాల్లో సమిష్టిగా చేతులు కలపడం 18).అందరి చిరునామాలు అందరి వద్ద ….. ఎన్నో అవసరాలు తీర్చడానికి మన అందరి చిరునామాలు గోత్రాలు ఫోన్ నెంబర్లు అందరికీ అందుబాటులో ఉంచడం 19). ఏరియావారీగా సమావేశాలు …. మారుతున్న అవసరాలకు తగ్గట్టు మన ఏరియా లోని వారు ఎక్కడికక్కడ అ సమావేశాలు ఏర్పాటు చేసుకొని తేనీటి విందు లో భాగస్వామ్యం వహించడం 20). సమస్త సమాచారం ఒకే చోట …. మన ఊరి విషయాలు మన వారి విషయాలు అన్ని అంశాల సమాచారాలు వెబ్సైట్లో ఏర్పాటు చేసుకొని సమయాన్ని బట్టి అందరూ వినియోగించుకోవడం 21).తాజాగా నగర వార్తలు సౌకర్యాలు సమస్యలు తెలుపు కోవడం 22).కొత్తగా నగరానికి వచ్చే మనవారికి నూతనంగా ఇండ్లను ప్రదేశాలను అపార్ట్మెంట్లను కలిపించే వేదికగా మన గ్రూపు ఏర్పడడం